చంద్రహాస్ కోట్ల హీరోగా చెందు ముద్దు దర్శకత్వంలో దినేష్ కుర్ర నిర్మిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది.
ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రెరా మాజీ ఛైర్మన్ డా. ఎన్. సత్యనారాయణ క్లాప్ కొట్టగా, గంగరాజు కాకర్ల, రంగారావు వేములపల్లి, సిరాజ్ ఎస్ఎం, మధుసూదన్ టీమ్‌కు స్క్రిప్ట్ అందజేశారు. దీపా ఆర్ట్స్ అధినేత శ్రీనివాస్ గౌడ కెమెరా స్విచాన్ చేశారు. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ చిత్రానికి శివా రెడ్డి ఎస్వి సినిమాటోగ్రాఫర్‌గా, డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. చెందు ముద్దు గతంలో 'ఓ పిట్ట కథ' (2020) అనే చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
