చంద్రయాన్-2 ప్రాజెక్ట్ నుంచి ఆ రెండు నేర్చుకున్నా: నరేంద్ర మోడీ

చంద్రయాన్-2 ప్రాజెక్ట్ నుంచి ఆ రెండు నేర్చుకున్నా: నరేంద్ర మోడీ

బుల్లెట్లు, బాంబులకంటే అభివృద్ధి శక్తివంతమైనదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తన రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ లో మోడీ మాట్లాడారు. జమ్మూకశ్మీర్ లో విద్వేషాన్ని వ్యాప్తి చేసి… అభివృద్ధిని అడ్డుకోవాలనుకునే ప్రయత్నాలు ఎన్నటికీ సక్సెస్ కాబోవన్నారు. అభివృద్ధిపైనే జమ్మూకశ్మీర్ ప్రజలు ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ISRO శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. చంద్రయాన్-2 ప్రాజెక్ట్ నుంచి నమ్మకం, భయపడకపోవడం అనే రెండు అంశాలు తాను నేర్చుకున్నట్టు చెప్పారు.