Spain vs France Chaos: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) సెమీఫైనల్‌లో ఫ్రాన్స్ జట్టు ఊహించని పరాజయం పాలవడంతో ఆ దేశ ఫుట్‌బాల్ అభిమానుల్లో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. డల్లాస్ వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోరులో స్పెయిన్ 2–0 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లగా, లెస్ బ్లూస్ (Les Bleus) టైటిల్ ఆశలు సెమీస్‌లోనే గాల్లో కలిసిపోయాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత ఫ్రాన్స్ వీధులన్నీ అభిమానుల కన్నీళ్లతో నిండిపోయాయి.
మొదటి నుంచి ఒత్తిడిలో ఫ్రాన్స్:
మ్యాచ్ ప్రారంభం నుంచే స్పెయిన్ జట్టు పూర్తి నియంత్రణతో ఆడింది. మొదటి సగంలోనే మిగ్యుల్ ఓయర్జబల్ పెనాల్టీ స్పాట్ నుంచి లభించిన అవకాశాన్ని అద్భుతమైన గోల్‌గా మార్చడంతో స్పెయిన్ ఖాతా తెరిచింది. ఈ గోల్‌తో ఫ్రాన్స్ ఆటగాళ్లపై ఆదిలోనే తీవ్రమైన ఒత్తిడి పడింది. స్టార్ స్ట్రైకర్ కైలియన్ ఎంబాపె, అతని సహచరులు గోల్స్ చేయడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ, స్పెయిన్ డిఫెన్స్, మిడ్‌ఫీల్డ్ వారిని ప్రతి దశలోనూ అడ్డుకుంటూ తీవ్రంగా నిరాశపరిచింది.
స్పెయిన్ దెబ్బకి ఫ్రాన్స్ ఫ్యాన్స్ షాక్:
తమ జట్టు సెకండ్ హాఫ్‌లోనైనా పునరాగమనం చేస్తుందని ఫ్రాన్స్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో, స్పెయిన్ మరో షాక్ ఇచ్చింది. మ్యాచ్ 58వ నిమిషంలో పెడ్రో పోరో ఫ్రాన్స్ గోల్‌కీపర్‌ను దాటిస్తూ బంతిని నెట్‌లోకి పంపించి స్పెయిన్ ఆధిక్యాన్ని 2–0కి పెంచాడు. ఈ రెండో గోల్ పడటంతో టీవీ స్క్రీన్ల ముందు, స్టేడియంలో ఉన్న ఫ్రాన్స్ మద్దతుదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారి మొహాల్లో నిరాశ స్పష్టంగా కనిపించాయి.
చేతులెత్తేసిన ఎంబాపె సేన:
మ్యాచ్ ఆఖరి నిమిషాల్లో ఫ్రాన్స్ జట్టు గోల్ కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ, స్పెయిన్ ప్లేయర్స్ ఏమాత్రం పట్టు సడలించకుండా అద్భుతంగా డిఫెండ్ చేసుకున్నారు. ఎంబాపె నేతృత్వంలోని ఫ్రాన్స్ అటాకింగ్ లైన్.. స్పెయిన్ నిర్మించిన అడ్డుగోడను ఛేదించడంలో పూర్తిగా విఫలమైంది. రెఫరీ చివరి విజిల్ వేయడంతో ఫ్రాన్స్ వరల్డ్ కప్ ప్రయాణానికి చెక్ పడటంతో, ఆ దేశ అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగరంలో ఫ్రాన్స్ అభిమానులు నానా రచ్చ చేశారు, ఫ్యాన్స్ హంగామాతో డల్లాస్ సిటీలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
フランスっぽくないフランス代表が、スペインに2-0で敗れた後、フランスっぽくない人が、フランスっぽくないフランスで暴動。なんなのか?pic.twitter.com/PQArDft72v pic.twitter.com/gE47qBim5R
— 髙安カミユ(ミジンコまさ) (@martytaka777) July 14, 2026
