బీఆర్ఎస్ నేతలంతా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలె ; చరణ్ కౌశిక్ యాదవ్

బీఆర్ఎస్ నేతలంతా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలె ; చరణ్ కౌశిక్ యాదవ్
  • పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతలు   డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ సవాల్ చేశారు.  కేటీఆర్ బామ్మర్ది ఫామ్‌‌‌‌హౌస్ పార్టీలో పాల్గొన్న వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్​లో పాజిటివ్ వచ్చిందని, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌‌‌‌ హౌస్‌‌‌‌ లోనూ డ్రగ్స్ దొరికాయన్నారు.

కేదార్ అనే వ్యక్తి దుబాయ్‌‌‌‌ లో చనిపోయారని, డ్రగ్స్ టెస్ట్ కు కేటీఆర్ ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆదివారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. 50 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ జాతీయ ఖాతాలో రూ.900 కోట్లు, రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అకౌంట్‌‌‌‌లోకి రూ.1,500 కోట్లు ఎలా వచ్చాయని నిలదీశారు.