కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’. జూలై 24న విడుదలైన ఈ మూవీ ఇవాళ ఆగస్టు 21, 2026 నుంచి స్ట్రీమింగ్కి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (SonyLIV)లో స్ట్రీమ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.
‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్..
రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేమ, కుటుంబ భావోద్వేగాలను మేళవించిన కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి థియేటర్లలో ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా సినిమాలోని పాటలు, కథలోని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ మధ్య కెమిస్ట్రీకి కూడా మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాకు తొలిరోజుల నుంచే ప్రేక్షకుల ఆదరణ కొనసాగింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర బృందం సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటోంది. థియేట్రికల్ రన్‌లో మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి టాక్ అందుకుంటుందో చూడాలి.
Love found its city
— Mass Movie Makers (@MassMovieMakers) August 21, 2026
Chennai found its story ❤️
The love story everyone’s talking about is NOW STREAMING 🎬#Chennailovestory STREAMING NOW, only on @SonyLIV @Kiran_Abbavaram @srigouripriya@SKNonline #SaiRajesh @DheeMogilineni @MassMovieMakers @AmruthaProd pic.twitter.com/W2U7AM3uMh
కిరణ్ అబ్బవరం సినిమాలు ‘OTT’
ఇకపోతే, సాధారణంగా తెలుగు సినిమాలు థియేట్రికల్ రన్ అనంతరం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. ముఖ్యంగా కిరణ్ నటించిన సినిమాలు K-Ramp’ ఆహా వీడియోతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఆహాలో అందుబాటులో ఉంది. ‘రూల్స్ రంజన్’ ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ‘సమ్మతమే’ మూవీ ఆహాలో, ‘SR కల్యాణమండపం’ కూడా ఆహాలో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ‘సెబాస్టియన్ P.C. 524’ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘KA’ మూవీ ఈటీవీ విన్ (ETV Win)లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ‘చెన్నై లవ్ స్టోరీ’ మాత్రం ఊహించని విధంగా సోనీ లివ్‌లో డిజిటల్ రిలీజ్ కానుండటం ఆసక్తిని కలిగిస్తోంది.
There is nothing stronger in the world than her love💖#SonyLIV #SonyLIVMalayalam #ChennaiLoveStory #StreamingNow #RaviNamburii #SaiRajesh #KiranAbbavaram #SriGouriPriya pic.twitter.com/2RAyk6Uk1W
— Sony LIV Malayalam (@SonylivMal) August 21, 2026
కథేంటంటే:
నివి (శ్రీ గౌరీ ప్రియ) అజయ్ (త్రిగుణ్) అనే అబ్బాయిని ప్రాణంగా ప్రేమిస్తుంది. తీరా పెళ్లి పీటలకు వచ్చేసరికి నివిని వదిలేసి త్రిగున్ వేరే అమ్మాయితో చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతాడు. ఇక ఆ బాధ తట్టుకోలేక నివి తీవ్ర మనోవేదనకు గురవుతుంది. ఇక ఇదే సమయంలో నివిని బాధలో నుంచి బయటపడేయడానికి తన ఫ్రెండ్స్ చెన్నైకి తీసుకెళ్లారు.
అక్కడే అదే సమయంలో డైరెక్టర్ కావాలనే కలతో చెన్నైకి స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) అనే కుర్రాడు వస్తాడు. అలా అనుకోకుండా నివి జీవితంలోకి స్టీవెన్ ఎంట్రీ ఇస్తాడు. మొదట విభేదాలతో మొదలైన వారి పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. అలా అంతా సవ్యంగా సాగుతోందనుకున్న టైంలోనే వారి జీవితాలను మార్చేసే ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంటుంది. ఆ సంఘటన ఏమిటి? చివరికి వారి ప్రేమ కథ ఎలాంటి ముగింపుకు చేరుకుంది? అనేదే మిగతా కథ.
