టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story). ఇవాళ శుక్రవారం (జూలై 24, 2026న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్‌గుడ్ రొమాంటిక్ డ్రామాను SKN, సాయి రాజేష్ నిర్మించగా, మణిశర్మ సంగీతం అందించారు. ఐటీ హబ్ నేపథ్యంలో ప్రేమ, కెరీర్ కలల మధ్య సాగే అందమైన భావోద్వేగ ప్రయాణంగా ఈ సినిమా రూపొందింది.
‘బేబీ’ డైరెక్టర్ సాయి రాజేష్ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడంతో సినిమాపై భారీ హైప్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్ ముందే ఫీల్ గుడ్ వైబ్స్తో భారీ అంచనాలు పెంచేలా చేసింది. మరి కిరణ్ లవ్ స్టోరీ ఎలా ఉంది? మరో బేబీ అవుతుందా? సినిమా చూసిన ఆడియన్స్ టాక్ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
నివి (శ్రీ గౌరీ ప్రియ) అజయ్ (త్రిగుణ్) అనే అబ్బాయిని ప్రాణంగా ప్రేమిస్తుంది. తీరా పెళ్లి పీటలకు వచ్చేసరికి నివిని వదిలేసి త్రిగున్ వేరే అమ్మాయితో చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతాడు. ఇక ఆ బాధ తట్టుకోలేక నివి తీవ్ర మనోవేదనకు గురవుతుంది. ఇక ఇదే సమయంలో నివిని బాధలో నుంచి బయటపడేయడానికి తన ఫ్రెండ్స్ చెన్నైకి తీసుకెళ్లారు. అక్కడే అదే సమయంలో డైరెక్టర్ కావాలనే కలతో చెన్నైకి స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) అనే కుర్రాడు వస్తాడు. అలా అనుకోకుండా నివి జీవితంలోకి స్టీవెన్ ఎంట్రీ ఇస్తాడు. మొదట విభేదాలతో మొదలైన వారి పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. అలా అంతా సవ్యంగా సాగుతోందనుకున్న టైంలోనే వారి జీవితాలను మార్చేసే ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంటుంది. ఆ సంఘటన ఏమిటి? చివరికి వారి ప్రేమ కథ ఎలాంటి ముగింపుకు చేరుకుంది? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే:
కాంప్లికేటెడ్‌గా ఉండే స్వచ్ఛమైన ప్రేమకథే ‘చెన్నై లవ్ స్టోరీ’. షార్ట్ కట్లో చెప్పాలంటే.. చెన్నైలో తన కలలను సాకారం చేసుకునే క్రమంలో ప్రేమలో పడిన ఇద్దరు యువతి, యువకుడి భావోద్వేగ ప్రయాణమే ఈ ‘చెన్నై లవ్ స్టోరీ’. సినిమాలో హీరో ప్రేమించిన అమ్మాయిని ఎప్పుడూ ‘మీరు.. అండీ’ అని గౌరవంగా పిలుస్తాడు. ప్రేమలోనూ మర్యాద ఎంత అందంగా ఉంటుందో ఈ కథ చూపిస్తుంది. అందుకే ‘చెన్నై లవ్ స్టోరీ’ ఒక ప్యూర్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు.
ఫస్టాఫ్.. ప్రేమలో ఫెయిల్ అయినా హీరోయిన్ కోణంలో కథ మొదలవుతుంది. ప్రీ ఇంటర్వెల్లో వచ్చే ఎమోషనల్ సీన్స్.. "గుర్తుందా" పాటతో మూవీ ఆసక్తికరంగా సాగుతుంది. ఐటీ హబ్‌ల మధ్య, లవ్ అండ్ కెరీర్ డ్రీమ్స్ మధ్య సాగే ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీ ఫస్టాఫ్ లో చూపించారు డైరెక్టర్. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ పెళ్లైన ప్రతి ఒక్కరినీ కచ్చితంగా టచ్ చేస్తాయి. అయితే సెకండాఫ్‌లో ఫాంటసీ (ఆత్మల) టచ్, లాజిక్‌కు దూరమైన స్క్రీన్ ప్లే, అందరికీ కన్విన్స్ కాకపోవచ్చు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ క్లైమాక్స్.. ఆడియన్స్ ఎంతవరకు కనెక్ట్ అవుతారనేది తెలియాల్సి ఉంది.
నటీనటులు పెర్ఫార్మన్స్ & టెక్నీకల్:
ఈ చెన్నై ప్రేమకథలో కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్టీవెన్ పాత్రలో సహజమైన నటనతో మెప్పించారు. శ్రీగౌరీ ప్రియ కూడా ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించి మెప్పించింది. తన నివి పాత్రతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
దర్శకుడు రవి నంబూరి లవ్, ఎమోషన్స్ ను కలగలిపి వెండితెరపై.. మరో చక్కని ప్రేమకథను ఆవిష్కరించారు. ముఖ్యంగా మణిశర్మ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ సినిమాను నిలబెట్టడంలో మరో ముఖ్యమైన పాత్ర పోషించాయి.
చివరగా.. డైరెక్టర్ సాయి రాజేష్..‘బేబీ’ తర్వాత మరో ఎమోషనల్ లవ్ స్టోరీతో వచ్చి సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్‌లో లవ్, ఎమోషన్స్, మణిశర్మ సంగీతంతో స్క్రీన్ ప్లే హార్ట్ టచ్ అయ్యేలా రాసుకున్నాడు. సెకండాఫ్‌లో ఫాంటసీ టచ్ ఉన్నప్పటికీ ఎమోషనల్ సీన్స్ మంచి ఇంపాక్ట్ ఇచ్చేలా చేయడంలో మార్క్ చూపించాడు.
