GT vsCSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్

 GT vsCSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ 2023కు తెరలేసింది. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియం తొలి మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తోంది.  ఫస్ట్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచులో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ను ఓడించి బోణి కొట్టాలని చెన్నై భావిస్తుండగా..ఆరంభ మ్యాచులోనే మాజీ ఛాంపియన్ను మట్టికరిపించి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని గుజరాత్ ప్లాన్స్ తో ఆడుతోంది. 


గుజరాత్ టైటాన్స్‌ తుది జట్టు : హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, యష్ దయల్, జోషువా లిటిల్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ


చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్/వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజ్యవర్థన్ అంగరకేకర్