ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర

ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అసత్యపు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు  చెన్నూర్  కాంగ్రెస్ శ్రేణులు.  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతారని మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ రాజి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.   చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రతిష్టతను దెబ్బ తీయడానికి కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని  విమర్శించారు.

 చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు చేస్తున్న అక్రమ వ్యాపారాలకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అడ్డుపడుతున్నారని అందుకే  అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అసత్యపు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని తీవ్రంగా హెచ్చరించారు కాంగ్రెస్ నాయకులు.

చెన్నూరులో అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముందుకెళ్తున్నారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయల పనులకు శంకుస్థాపనలు చేశారు. అక్రమ ఇసుక వ్యాపారాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. అయితే ఇది చూసి ఓర్వలేని ఓ వర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు.