- మంత్రికి స్థానిక నేతల కృతజ్ఞతలు
- 12వ వార్డులో సీసీ రోడ్డుకు భూమిపూజ
చెన్నూరు, వెలుగు : చెన్నూరు మున్సిపాలిటీకి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ భారీగా నిధులు తెస్తున్నారని, పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. పట్టణంలోని 12వ వార్డు అభివృద్ధి కోసం మంత్రి రూ. 55 లక్షలు కేటాయించారు. ఇందులో రూ. 15 లక్షలతో గురువారం 100 మీటర్ల సీసీ రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
చెన్నూరులో మార్నింగ్ వాక్ లో భాగంగా వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని మంత్రి వివేక్ వెంకటస్వామి వెంటనే పరిష్కరిస్తున్నారని తెలిపారు. అమృత్ స్కీం కింద తాగునీటి వాటర్ ట్యాంకులు, పాత బస్టాండ్ నుంచి రాగి చెట్టు పెద్ద చెరువు వరకు రోడ్డు విస్తరణ పనులు, వంద పడకల ఆస్పత్రి పనులు చేపట్టారన్నారు.
కార్యక్రమంలో12వ వార్డ్ కౌన్సిలర్ నజ్మా, మున్సిపల్ వైస్ చైర్మన్ నాయకపు వినయ్ కుమార్, చెన్నూరు పట్టణ కన్వీనర్ లింగంపల్లి మహేశ్, అమీర్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సాహిర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దింటి శ్రీనివాస్, పాతర్ల నాగరాజు, ఎండీ ఖలీల్, దాసరి కమలాకర్, ఎండీ ఆసిఫ్, సయ్యద్ ఇంతర్, కర్రు సంతోష్, ఎల్లాగౌడ్, ఈమద్ తదితరులు పాల్గొన్నారు.
