70 ఏండ్ల వయసులో స్కై డైవింగ్.. చత్తీస్​గఢ్​ మంత్రి దియో సాహసం

70 ఏండ్ల వయసులో స్కై డైవింగ్.. చత్తీస్​గఢ్​ మంత్రి  దియో సాహసం

 

  • 70 ఏండ్ల వయసులో స్కై డైవింగ్
  • చత్తీస్​గఢ్​ మంత్రి  దియో సాహసం
  • ట్విట్టర్​లో వీడియో పోస్టుతో వైరల్​

కాన్​బెర్రా(ఆస్ట్రేలియా): స్కై డైవింగ్​కు ఏజ్​తో సంబంధంలేదని చత్తీస్​గఢ్  మంత్రి నిరూపించారు.  70 ఏండ్ల వయసున్న ​టీఎస్ సింగ్ దియో .. ఇటీవల ఆస్ట్రేలియాలో స్కై డైవింగ్ చేశారు. స్పెషల్ గేర్ సూట్ వేసుకున్న మంత్రి..  డైవ్​కు ముందు తన ఇన్​స్ట్రక్టర్​తో సెల్ఫీ వీడియో ఆన్ చేశారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత పారాచూట్ సాయంతో ఇద్దరూ కలిసి కిందికి దూకారు. ఆకాశంలో ఉన్న టైంలో ఆయన నవ్వుతూ కనిపించారు. ఆ తర్వాత పారాచూట్ ఓపెన్ చేసుకుని ల్యాండ్ అయ్యారు. స్కై డైవింగ్​కు సంబంధించిన మొత్తం వీడియోను మంత్రి టీఎస్ సింగ్ దియో తన ట్విట్టర్​లో పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్ అయ్యింది. ‘‘ఆకాశానికి హద్దు లేదు. ఆస్ట్రేలియాలో ఈసారి నాకు స్కై డైవింగ్ చేసే అవకాశం వచ్చింది. ఇదో అద్భుతమైన అనుభవం” అంటూ దియో ట్విట్టర్​లో రాసుకొచ్చారు. వీడియో చూసిన సీఎం భూపేశ్ బాఘెల్‌‌ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘‘గ్రేట్ మహారాజా సాబ్.. మీరు అద్భుతం చేశారు” అంటూ  భూపేశ్​ బాఘెల్ కొనియాడారు.