మొదలైన సూర్యపుత్ర కర్ణ.. టీజర్ విజువల్స్ నెక్స్ట్ లెవల్

మొదలైన సూర్యపుత్ర కర్ణ.. టీజర్ విజువల్స్ నెక్స్ట్ లెవల్

భారతీయ ఇతిహాసం మహాభారతం ఆధారంగా తెరెకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సూర్యపుత్ర కర్ణ(Suryaputra Karna). ఈ సినిమాలో చియాన్ విక్రమ్(Chiyan Vikram) కర్ణుడిగా కనిపించనున్నాడు. దాదాపు ఐదేళ్ల క్రితమే దర్శకుడు ఆర్‌ఎస్‌ విమల్‌(RS Vimal) సూర్యపుత్ర కర్ణ సినిమాను ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమా కోసం మూడొందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారని ప్రచారం కూడా జరిగింది కానీ.. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది.

ALSO READ : కామారెడ్డి పోటీపై కేసీఆర్ ​సందిగ్ధంలో పడ్డారు : మాజీ మంత్రి షబ్బీర్​ అలీ

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది అంటూ ప్రకటించారు మేకర్స్. ఈ సందర్బంగా కర్ణుడి పాత్రలో ఉన్న విక్రమ్‌ ఫోటోను, అనౌన్స్మెంట్ టీజర్‌ ను కూడా రిలీజ్ చేశారు. 3డీ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్లో విజువల్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. విల్లు పట్టుకొని యుద్ధ రంగంలో ఉన్న విక్రమ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్సలెంట్ గా ఉంది. ఈ ఒక్క టీజర్ తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అనుకోకుండా వచ్చిన ఈ భారీ అప్డేట్ తో విక్రమ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.