చిదంబరం అరెస్ట్ పై ఆర్జీవీ కామెంట్

చిదంబరం అరెస్ట్ పై ఆర్జీవీ కామెంట్

ఎప్పుడూ వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో ఉండే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ సారి ఐఎన్ ఎక్స్ కేసులో  అరెస్ట్ అయిన కేంద్రమాజీ మంత్రి చిదంబరంపై కామెంట్ చేశారు. ప్రస్తుతం చిదంబరాన్ని ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారిస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన వర్మ చిదంబరం అరెస్ట్ నిజమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్నారు. ఆయన అరెస్ట్ లో ఒ స్పెషల్ ఉందంటూ ఎద్దేవా చేశారు. చిదంబరం గతంలో కేంద్ర హోంమంత్రి హోదాలో ప్రారంభించిన సీబీఐ ఆఫీసులోనే ప్రస్తుతం ఆయన విచారణ ఎదుర్కొంటున్నారని అన్నారు.  చట్టానికి ఎవరూ అతీతులు కారని మోడీ ప్రభుత్వం నిరూపించిందన్నారు వర్మ.