క్యూట్ బాయ్.. ఎంత తెలివి: టీచర్‌కు నేను చెప్పినట్లే.. చెప్పు డాడీ

క్యూట్ బాయ్.. ఎంత తెలివి: టీచర్‌కు నేను చెప్పినట్లే.. చెప్పు డాడీ

ఈకాలం పిల్లల తెలివితేటలు ఏ రేంజ్‌లో ఉంటున్నాయో పిల్లలున్న తల్లిదండ్రులందరికీ విదితమే. ఉదయాన్నే లేచింది మొదలు సెల్ ఫోన్‌లో తలపెట్టే ఇప్పటి పిల్లలు.. అవి ఇవి అంటూ ఏవేవో మాటలు చెప్తుంటారు. ఆ తెలివితేటలు చూసి మెక్కుచుకోవాలో! భవిష్యత్తులో ఇదెక్కడ అనర్థానికి దారి తీస్తుందో అని భయపడాలో! అంతు పట్టని పరిస్థితి.. తల్లిదండ్రులది.  

ఇలానే ఓ పిల్లాడు పేరెంట్-టీచర్ మీటింగ్‌కు వెళ్లే ముందు అక్కడ ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడుకూడదో అన్న విషయాలపై తన  తండ్రికి చిన్నపాటి జ్ఞానబోధ చేశాడు. పిల్లవాడు చాలా ముద్దుగా.. వినయంగా టీచర్‌కు ఏం చెప్పకూడదో క్లుప్తంగా వివరించాడు. ఒకవేళ ఏదేని సంధర్భంలో అబద్ధం చెప్పాల్సి వస్తే చెప్పు కానీ తిట్టకూడదని కూడా చెప్తున్నాడు. తండ్రి కూడా పిల్లవాడిని మళ్లీ మళ్లీ అదే విషయం అడుగుతూ.. అతని నుంచి సమాధానాలు రాబడుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా

ఈ పిల్లాడికి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతానే ఉంది. 'cheekuthenoidakid' అన్న ఇన్‌స్టా ఐడీలో అన్నీ ఈ బుల్లబ్బాయి విడియోలే. దాదాపు 19వేళా మంది అతన్ని ఫాలో అవుతున్నారు. ఈ ఐడీని బట్టి అతని నిక్ నేమ్ 'చీకూ' అని తెలుస్తోంది.