తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు

తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు
  • తైవాన్ చుట్టూ చైనా లైవ్ ఫైర్ మిలటరీ డ్రిల్స్ తీవ్రం
  • తమ జోన్ లో 5 బాలిస్టిక్ మిసైల్స్ ఫైర్ చేశారన్న జపాన్
  • తైవాన్కు అండగా రంగంలోకి దిగిన అమెరికా

బీజింగ్:  తైవాన్ ను అష్టదిగ్బంధం చేసింది చైనా.. తైవాన్ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలను ప్రారంభించింది. వైమానిక దళం, నౌకాదళంలో సైనిక విన్యాసాలను చేపట్టింది. ఈ విన్యాసాలు తైవాన్ ప్రాదేశిక జలాల్లో కొనసాగుతున్నాయి. టార్గెట్ చేసి లక్ష్యాలను దిగ్బంధించడం, భూతలంతో పాటు.. సముద్రంలోని లక్ష్యాలను ఛేదించడం, గగనతలాన్ని నియంత్రించడం ఈ విన్యాసాల లక్ష్యమని చైనా అధికారులు ప్రకటించారు. ఆదివారం వరకు డ్రిల్ కొనసాగుతుందని చైనా ప్రకటించింది. 

చైనా కవ్వింపు చర్యలతో తైవాన్ అలర్ట్..అండగా అమెరికా నౌకల మొహరింపు

చైనా కవ్వింపు చర్యలతో తైవాన్ అలెర్ట్ అయ్యింది. తమ దేశ సైన్యాన్ని అలర్ట్ చేసింది. సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ ను చేపడుతోంది. అమెరికా నావికాదళం తైవాన్ కు సమీపంలో పలు నౌకలను మోహరించింది. తైవాన్ కు అండగా నిలుస్తామని అమెరికా ప్రకటించింది. తైవాన్ ను స్వాధీనం చేసుకునేందుకు చైనా ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే తైవాన్ మాత్రం స్వతంత్ర్య దేశంగా ఉండేందుకు ఇష్టపడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా..పలు పశ్చిమదేశాలు తైవాన్ తో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఇది ఇష్టంలేని చైనా.. తరుచూ కవ్వింపులకు పాల్పడుతోంది. యూఎస్ స్పీకర్ పెలోసీ పర్యటన తర్వాత డ్రాగన్ కంట్రీ చర్యలు మరింత ముమ్మరం చేసింది. వివిధ కారణాలతో తైవాన్ నుంచి పలు దిగుమతులపై నిషేధం విధించింది.