
అవతలి వాళ్లు బాధలో.. ఆందోళనలో ఉన్నపుడు ఆప్యాయంగా కౌగిలించుకుంటే వారి మనసు తేలికవుతుందనే కాన్సెప్ట్ గుర్తుందా. శంకర్ దాదా ఎంబీబీఎస్ అనే సినిమాలో వచ్చిన ఈ కాన్సెప్ట్ అప్పట్లో ఎంతో పాపులర్ అయ్యింది. ఆలోచింపజేసింది. ప్రపంచం ఎవరి పనిలో వారు పడిపోవటం వలన ఎదుటి వ్యక్తి పరిస్థితి ఏంటి.. ఏ సిచువేషన్ లో ఉన్నాడు.. అని ఆలోచించేవారు లేక వాళ్లు పడే వేదనను ఒక్క ఆలింగనంతో ఎలా తీర్చవచ్చో ఆ కాన్సెప్ట్ ఉద్దేశం.
ఇప్పుడు అదే కాన్సెప్ట్.. చైనాలో డబ్బులు కురిపిస్తోంది. అక్కడి మహిళలు ఒక ఐదు నిమిషాలు హగ్ ఇచ్చినందుకు 600 రూపాయలు ఇస్తున్నారు పురుషులకు. కాసేపు పురుషుల కౌగిలిలో సేదతీరి మనసు తేలిక పర్చుకుంటున్నారు. అందుకోసం వాళ్లకు డబ్బులు ఇస్తున్నారు. ఈ కాన్సెప్ట్ నే వాళ్లు ‘మ్యాన్ మమ్స్’ అనే అని పిలుస్తున్నారు. అంటే పురుషుల్లో తల్లిని చూడటం.. అమ్మ స్పర్ష లాంటి ఒక్క కౌగిలింతతో స్ట్రెస్ రిలీవ్ చేయడం దీని ఉద్దేశం. దీని కోసం ప్రత్యేక యాప్స్ క్రియేట్ చేశారంటే ఈ మ్యాన్ మమ్స్ కాన్సెప్ట్ ఎంత పాపులర్ అయ్యిందో ఆలోచించండి.
హౌజ్ వైఫ్ లు, ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలు.. పనిభారంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో అడిగి మరీ రెడీ చేయడం.. భర్త ఆఫీస్ కోపాన్ని ఇంట్లో తీసినప్పుడు భరించడం.. అత్తామామల ఆగడాలను భరించడం.. లాంటి పరిస్థితులలో మహిళలు తీవ్రంగా మనో వేదనకు గురవుతుంటారు. తమ ఆందోళన, ఆవేదన గురించి ఎవరికి చెప్పుకోవాలో.. ఎలా తగ్గించుకోవాలో తెలియక తమలో తామే కుంగిపోతూ ఉంటారు.
అలాంటి మహిళలకు ఒక్క ఆలింగనంతో వాళ్ల మనసును తేలికపరిచే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారట. ఒక్క హగ్ తో వాళ్లలోపల ఉన్న భయాలు, ఆందోళన తొలగిపోయి మానసిక ప్రశాంతత పొందుతున్నారట. అందుకే ఇది బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. అందుకోసం డబ్బులు ఇచ్చి ఉపశమనం పొందుతున్నారు మహిళలు.
స్కూల్ సమయంలో నేను ఒకసారి ఇలాగే హగ్ చేసుకోవడం వలన నా స్ట్రెస్ అంతా పోయింది. ఒక ఐదు నిమిషాలు స్టేషన్ లో హగ్ చేసుకోవడం వలన మన స్ట్రెస్ పోగొట్టుకోవచ్చు..’’ అని సోషల్ మీడియలో ఒక అమ్మాయి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చాలా వైరల్ అయ్యింది. ఏకంగా ఒక లక్ష కామెంట్స్ వచ్చాయి.
అయితే ఈ హగ్స్ కోసం ప్రత్యేక యాప్స్ రూపొందిచారు. సోషల్ మీడియాలో, యాప్స్ లో మహిళలు హగ్ కోసం వెతికి.. ఏ వ్యక్తితో హగ్ కావాలో సెలెక్ట్ చేసుకుంటారు. ఆ వ్యక్తి బాడీ టైప్, సహనం, ప్రవర్తన, అప్పీరెన్స్ మొదలైనవి చూసి సెలెక్ట్ చేసుకుంటారు. ఒక్కోసారి ప్రైవేట్ గా ముందుగానే చాట్ చేసుకుని.. నచ్చితేనే హగ్ కోసం ఎంచుకుంటారు.
అయితే ఎక్కువ శాతం పబ్లిక్ ప్లేస్ లోనే హగ్స్ జరుగుతుంటాయి. షాపింగ్ కాంప్లెక్స్, అండర్ గ్రౌండ్ స్టేషన్స్ మొదలైన ప్రాంతాల్లో ఓపెన్ గా హగ్ చేసుకుంటారు. ఇందులో చెడుగా ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదని చెబుతున్నారు. ఈ హగ్ కు రూ.250 నుంచి 600 వరకు పురుషులు చార్జ్ చేస్తారు.
కాన్సెప్ట్ ఏదో వింతగా ఉన్నప్పటికీ.. ఇది స్ట్రెస్, ఆందోళన, బాధలో ఉన్న మహిళలు మంచి ఉపశమనం ఇస్తుందట. వారికి ఒదార్పు కలిగిస్తుందట. కొంత మంది తమకు తల్లి ప్రేమలో ఉండే ఆలింగనం ఇక్కడ దొరుకుతుందని.. దీని వలన మనసు తేలిక అవుతుందని చెబుతున్నారు.
Amid rising societal stress, a growing number of young women in China are now paying 50 yuan (RM33) for a five-minute hug from men known as “man mums.” #ManMums #China #HugTherapy #MentalHealth #SocialTrends #SinarDaily https://t.co/N36ekzhJgo
— Sinar Daily (@sinardailymy) June 5, 2025