సోలార్ పంపు సెట్లతో సాగు సులభం: చిన్నారెడ్డి

సోలార్ పంపు సెట్లతో సాగు సులభం:  చిన్నారెడ్డి
  •     ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి

వనపర్తి, వెలుగు :  సోలార్ పంపు సెట్లను వినియోగించడం ద్వారా విద్యుత్ ఆదా చేయడమే కాకుండా, కరెంటు కోసం ఎదురుచూడకుండా పంటలకు సకాలంలో నీరందించవచ్చని ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు.

 ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి రైతు వేదికలో వ్యవసాయ, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా పంట మార్పిడి పద్ధతులు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. వ్యవసాయంలో యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం మరియు ఆయిల్ పామ్ సాగుపై అధికారులు రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు.