భారత్ vs వెస్టిండీస్ క్లైమాక్స్ మ్యాచ్.. చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ ఇదే!

భారత్ vs వెస్టిండీస్ క్లైమాక్స్ మ్యాచ్.. చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ ఇదే!

IND vs WI 5th T20 Bengaluru: భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య కొనసాగుతున్న ఐదు టీ20ల సిరీస్ క్లైమాక్స్‌కు చేరుకుంది. చెరో రెండు మ్యాచుల్లో గెలిచి 2–2తో సమంగా నిలిచిన ఇరు జట్లు.. ప్రతిష్టాత్మక సిరీస్ ని కైవసం చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వేదికగా రేపు (2026, అక్టోబర్ 17, శనివారం) జరగనున్న డిసైడర్ పోరులో సిరీస్ విజేత ఎవరో తేలబోతుంది. ప్రస్తుతం భారత గడ్డపై వెస్టిండీస్ అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనూ రాణిస్తూ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియాకు కఠినమైన సవాల్ విసురుతోంది. ఎంత పెద్ద టార్గెట్‌నైనా ఈజీగా ఛేదించేందుకు రెడీ అవుతూ, బోర్డుపై భారీ స్కోర్లు నిర్దేశించడంలోనూ డేంజరస్‌గా మారింది.

పిచ్ రిపోర్ట్.. భారత్‌కు ఆల్-రౌండ్ ప్రదర్శనే దిక్కు: 

టాస్‌తో సంబంధం లేకుండా ఈ సిరీస్‌లో ఫలితాలు వస్తున్న నేపథ్యంలో, ఈ చివరి మ్యాచ్‌లో గెలవాలంటే టీమిండియా ప్లేయర్ల ఆల్-రౌండ్ పర్ఫార్మెన్స్ చాలా కీలకం కానుంది. కేవలం పిచ్ పరిస్థితి లేదా వాతావరణంపై ఆధారపడకుండా, ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తేనే సిరీస్ చేజిక్కించుకునే ఛాన్స్ ఉంది. చిన్నస్వామి పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. కానీ విండీస్ బ్యాటర్లు మరోసారి చెలరేగినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లుగా ఇండియన్ బౌలర్లు బౌలింగ్ చేయకపోతే, సొంత గడ్డపై ఓటమిని చవిచూడటమే కాకుండా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

టీ20లలో విండీస్ తోపు.. చిన్నస్వామిలో భారత్ రికార్డు ఇదే: 

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత జట్టు ఇప్పటికే చిన్న జట్లపై విజయాలు సాధించినప్పటికీ, టీ20 ఫార్మాట్‌లో వెస్టిండీస్ అత్యంత ప్రమాదకరమైన జట్టు. స్వదేశంలో ఆడుతున్నప్పటికీ టీమిండయాకు విండీస్‌ను ఓడించడం అంత సులువు కాదని తెలుస్తోంది. బ్యాటర్లకు స్వర్గధామమైన చిన్నస్వామి స్టేడియంలో భారత్ రికార్డు కూడా ఆశించినంత మంచిగా లేదని తెలుస్తుంది. 

* మొత్తం మ్యాచ్‌లు: 8
* భారత్ విజయాలు: 4
* ఓటములు: 3
* ఫలితం తేలనివి: 1

షాయ్ హోప్ని ఔట్ చేస్తే గెలుపు మనదే: 

ఈ మైదానంలో బౌండరీలు (Boundaries) చిన్నవి కావడం వల్ల బౌలర్లకు ఇది నిజంగా పెద్ద అగ్ని పరీక్షే అని చెప్పాలి.. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ (Shai Hope) ప్రస్తుతం విధ్వంసకర ఫామ్‌లో ఉన్నాడు. చిన్నస్వామిలో అతన్ని పవర్ ప్లేలోనే పెవిలియన్ పంపితే టీమిండియాకు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. అలాగే ఇండియన్ బ్యాటర్లు కూడా పవర్ ప్లే నుంచి బౌండరీలతో విరుచుకుపడాల్సి ఉంటుంది.

►ALSO READ | IND vs WI మధ్య ఐదో టీ20.. ఫోన్లో మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

250 రన్స్ ఖాయం.. ముగ్గురు స్పిన్నర్లతో భారత్: 

చిన్నస్వామి స్టేడియం క్యూరేటర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ వికెట్‌పై ఏకంగా 250+ పరుగులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత బౌలర్ల ప్రదర్శనే డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది. అంతేకాదు, పిచ్ రాను రాను స్పిన్నర్లకు కూడా సహకరించే ఛాన్స్ ఉండటంతో టీమిండియా ముగ్గురు స్పిన్నర్ల (కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్) కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.