Chiru,Harish Movie: పూరి కథతో చిరు, హరీష్ మూవీ.. వైరల్ అవుతున్న మాస్ టైటిల్

Chiru,Harish Movie: పూరి కథతో చిరు, హరీష్ మూవీ.. వైరల్ అవుతున్న మాస్ టైటిల్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), దర్శకుడు హరీష్ శంకర్(Harish shankar).. ఈ కాంబో కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్(Pawan kalyan) గబ్బర్ సింగ్(Gammar Singh) రిలీజై బ్లాక్ బస్టర్ అయినప్పటినుండి ఈ కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక చిరు రీ ఎంట్రీ తరువాత ఇప్పటివరకు 5 సినిమా చేశారు. ఆ మధ్య కూడా ఈ కాంబోలో సినిమా ఆల్మోస్ట్ సెట్ అయిందని, త్వరలో షూటింగ్ మొదలుకానుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే అవి కూడా రూమర్స్ గానే మిగిలిపోయాయి. 

ఇప్పుడు తాజాగా మరోసారి చిరంజీవి, హరీష్ శంకర్ మూవీ తెరపైకి వచ్చింది. త్వరలోనే వీరి కాంబోలో సినిమా మొదలుకానుందట. అప్పట్లో దర్శకుడు పూరి జగన్నాధ్ చిరుతో చేద్దాం అనుకున్న ఆటోజానీ సినిమా కథనే చిరు, హరీష్ కాంబో కోసం ఒకే చేశారట. అదే కథకు హరీష్ శంకర్ కొన్ని మార్పులు చేశాడట. తనదైన స్టాల్లో పంచ్ లు, ప్రాసలు, హీరోయిజం ఉండేలా సెట్ చేశాడట. అదే కథను చిరుకి వినిపించగా ఆయన కూడా వెంటనే ఒకే చెప్పేశాడట. ఈ సినిమాకు ముందునుండి అనుకున్నట్లు గానే ఆటోజానీ అనే టైటిల్ నే ఫిక్స్ చేయనున్నారట. ఆ టైటిల్ అయితేనే ఆటు మాస్ కు ఇటు క్లాస్ కు సెట్ అయ్యేలా ఉంటుందని అనుకున్నారట మేకర్స్.   

ప్రస్తుతం విశ్వంభర షూట్ లో బిజీగా ఉన్న చిరు.. అది కంప్లీట్ అయినా వెంటనే హరీష్ మూవీ షూట్ లో పాల్గొంటారని టాక్. ఇక హరీష్ కూడా ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడా కంప్లీట్ చేయాలి హరీష్. ఈ రెండు సినిమాల తరువాతనే చిరంజీవితో సినిమా మొదలుపెట్టనున్నాడు ఈ దర్శకుడు.