Mega158 Update: చిరంజీవి ఉగ్రరూపం.. మెగా158 నుంచి అదిరిపోయే అప్‌డేట్!

Mega158 Update: చిరంజీవి ఉగ్రరూపం.. మెగా158 నుంచి అదిరిపోయే అప్‌డేట్!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మెగా 158’ చిత్రంపై మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్‌ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. వందలాది మంది ఫైటర్స్‌తో ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ బాబీ. ఈ ఎపిసోడ్‌లో చిరంజీవి ఇంతకుముందెన్నడూ కనిపించని ఉగ్రరూపంలో కనిపిస్తారని టాక్. చిరు ట్రేడ్‌మార్క్ మాస్ మేనరిజమ్స్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో రూపొందుతున్న ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను డిజైన్ చేస్తున్నారని సమాచారం. చిరంజీవి కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్‌లలో ఒకటిగా నిలవొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఆగస్టు 22న ‘మెగా 158’ సర్‌ప్రైజ్?

ఇటీవల మెగా 158 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయగా, శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌‌లో సెకండ్ షెడ్యూల్ షూట్ జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌‌డేట్‌‌ను అందించాడు తమన్. ‘మెగా 158 చరిత్ర.. ఆగస్టు 22న కలుద్దాం’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంటే చిరంజీవి బర్త్‌‌డే కానుకగా స్పెషల్ గ్లింప్స్‌‌ సిద్ధం చేస్తున్నట్టు తమన్ హింట్ ఇచ్చాడు. దీంతో చిరంజీవి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు

ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అదనపు స్క్రీన్‌ప్లే రచయితలుగా పనిచేస్తున్నారు. భాను–నందు డైలాగ్స్ రాస్తున్నారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక విడుదల తేదీ ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.