టాక్సీడ్రైవర్గా మారిన భోళా శంకర్... కొత్త లుక్ అదిరింది బాసూ

టాక్సీడ్రైవర్గా మారిన భోళా శంకర్... కొత్త లుక్ అదిరింది బాసూ

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో వస్తోన్న లేటెస్ట్ మూవీస్ "భోళా శంకర్"(Bholashankar ). మెహర్ రమేష్(Mehar ramesh) దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో.. మిల్కీ బ్యూటీ తమన్నా(Thamanna) హీరోయిన్ గా నటిస్తోంది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi suresh) మరో కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీ.. ఆగస్టు 11,2023న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాలు భారీగానే పెంచేసాయి. 

వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మెగాస్టార్ నుండి వస్తున్న మూవీ కావడంతో.. ఈ సినిమా  కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి కొన్ని  పోస్టర్ లను రిలీజ్ చేసారు మేకర్స్.  మే 1 కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ కొత్త పోస్టర్ లను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చిరు టాక్సీ డ్రైవర్ గా కనిపించాడు. రిలీజైన కొద్ది క్షణాల్లోనే ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొత్త పోస్టర్లలో చిరంజీవిని  చూసిన ఆడియన్స్.. గతంలో చిరు నటించిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలతో కంపేర్ చేసుకుంటున్నారు.

 అందులో ఒకటి గ్యాంగ్ లీడర్ కాగా.. మరొకటి ఇంద్ర. ఈ రెండు సినిమాల్లో కూడా చిరు టాక్సీ డ్రైవర్ గా   కనిపించాడు. ఆలాగే ఈ రెండు సినిమాలు చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఆ సినిమాల మాదిరిగానే భోళా శంకర్ కూడా సూపర్  హిట్ అవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి.. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.