హిందీలో భోళా శంకర్.. అక్కడ రిజల్ట్ ఎలా ఉండనుందో?

హిందీలో భోళా శంకర్.. అక్కడ రిజల్ట్ ఎలా ఉండనుందో?

మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) హీరోగా వచ్చిన భోళా శంకర్(Bhola shankar) ఆడియన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. అవుట్ డేటెడ్ స్టోరీ, వీక్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ఓపికకు పరీక్షపెట్టింది ఈ సినిమా. దీంతో చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలువనుంది ఈ సినిమా. 

తెలుగులో ఈ సినిమాకు ఆశించిన ఫలితం రాకపోవడంతో.. భోళా శంకర్ సినిమాను హిందీలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. నిజానికి ఈ సినిమాను తెలుగుతో పాటే హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. తాజాగా ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 25న ఈ సినిమా హిందీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. అంతేకాదు దానికి సంబంధించిన హిందీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక హిందీలో చిరంజీవికి ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. మరి తెలుగులో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు హిందీలో ఎలాంటి రిజల్ట్ రానుంది అనేది ఇప్పుడు ఆసక్తిరకంగా మారింది.

ఇక భోళా శంకర్ సినిమా విషయానికి వస్తే.. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్(Meher ramesh) తెరకెక్కించారు. తమన్నా(Thamannaah) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో.. కీర్తి సురేష్(Keerthi suresh) చిరుకి చెల్లిగా నటించారు.