కొత్త కారు కొన్న చిరంజీవి.. ఫ్యాన్సీ నెంబర్ ఎంతంటే..

కొత్త కారు కొన్న చిరంజీవి.. ఫ్యాన్సీ నెంబర్ ఎంతంటే..
  • ఖైరతాబాద్ ఆర్టీఏలో చిరంజీవి
  • కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన మెగాస్టార్

హైదరాబాద్ ,వెలుగు : మెగాస్టార్ చిరంజీవి బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఇటీవల ఆయన టయోటా వెల్​ఫైర్ కారు కొనగా.. ఆ వెహికల్ రిజిస్ర్టేషన్​ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వచ్చి ఫొటో దిగి, డిజిటల్ సైన్ చేశారు. రూ.4.70 లక్షలకు టీఎస్ 09జీబీ 1111 నంబర్​ను  కొనుగోలు చేశారు. చిరంజీవి కొన్న కొత్త కారు ధర సుమారు రూ.కోటికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే చిరంజీవి దగ్గర బోలెడు కార్లు ఉన్నాయి. అయినా మార్కెట్ లోకి వచ్చే కొత్త కారు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం టయోటా కంపెనీ నుంచి విడుదలైన కొత్త మోడల్ కారును కొనుగోలు చేశారు. దీని మార్కెట్ ధర కోటి 30 లక్షల రూపాయల వరకు ఉంది. అన్నీ ఫీచర్స్, ఇంటీరియర్ కలుపుకుంటే మరో 20 లక్షలు అనుకున్నా.. టోటల్ మెగాస్టార్ కోటిన్నరతో కొత్త కారును కొనుగోలు చేశారు. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసమే ఆయన ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. డబుల్ వన్.. డబుల్ 11.. నాలుగు ఒకట్ల ఫ్యాన్స్ నెంబర్ కోసం 4 లక్షల 70 వేల రూపాయలు చెల్లించారు చిరు.