కైకాలకు ఇదంటే ప్రాణం..నా భార్య వండి పెట్టేది:చిరు

కైకాలకు ఇదంటే ప్రాణం..నా భార్య వండి పెట్టేది:చిరు

కైకాల సత్యనారాయణతో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు కైకాల చూపించే ప్రేమ, వాత్సల్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఆయనను చూడాలి అనిపించిన ప్రతిసారి వాళ్ల ఇంటికి వెళ్లి కలిసే వాడినని చెప్పారు. మంచి మనస్సున్న కైకాల భోజన ప్రియుడని, సురేఖ చేతితో చేసిన ఉప్పు చేప అంటే ఆయనకు ఎంతో ఇష్టమని చిరంజీవి చెప్పారు.

కైకాల వందల సినిమాల్లో నటించిన గొప్ప నటుడు అని.. ఆయన తనను తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచివారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. అన్నయ్యను కోల్పోయానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆయనతో నటించిన ప్రతి సినిమా తనకు ఒక తీపి జ్ఞాపకమన్నారు.  ప్రభుత్వ లాంఛనాలతో ఘన నివాళి ఇస్తున్నట్లు ప్రకటించిన మంత్రి తలసానికి ధన్యవాదాలు అని చిరంజీవి చెప్పారు.