మళ్ళీ రీమేకా.. మావల్ల కాదన్నా ప్లీజ్ వదిలేయ్

మళ్ళీ రీమేకా.. మావల్ల కాదన్నా ప్లీజ్ వదిలేయ్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మరో కొత్త సినిమాకు పచ్చ జెండా ఊపారు. ఈ కొత్త ప్రాజెక్టు కోసం టాలెంటెడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల(Kalyan Krishna kurasala) మెగా ఫోన్ పట్టుకోనున్నాడు. మలయాళంలో డీసెంట్ హిట్ గా నిలిచిన బ్రో డాడీ(Bro Daddy) సినిమాకు రీమేక్ గా రానుంది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో చిరుకి కొడుకు పాత్రలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) కీ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం. 

ఈ సినిమాతో చాలా రోజుల తరువాత తెలుగులో హీరోయిన్ త్రిష(Trisha) రీ-ఎంట్రీ ఇవ్వనుందట. అంతేకాదు టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela) సిద్దు జొన్నలగడ్డకి జోడీగా కనిపించనుందట. అయితే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఈ ప్రాజెక్టు పై మెగా అభిమానులు కాస్త డిసపాయిటెడ్ గా ఉన్నారట. కారణం.. చిరంజీవి రీ ఎంట్రీ తరువాత వరుసగా ఇది నాల్గవ రీమేక్.

టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ స్ట్రయిట్ సినిమాలు చేస్తుంటే.. మెగాస్టార్ ఇలా రీమేక్ లు చేయడం అభిమానులు తీసుకోలేకపోతున్నారు. అందుకే బ్రో డాడీ రిమేక్ పై కాస్త డిసపాయిటెడ్ గా ఉన్నారట. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి.. ఇప్పటికైతే ఇది రూమర్ గానే అనుకోవాలి.