దిల్ రాజు సినిమా కోసం చిరు భారీ రెమ్యునరేషన్.. సీనియర్ హీరోల్లో మెగాస్టార్ టాప్

దిల్ రాజు సినిమా కోసం చిరు భారీ రెమ్యునరేషన్.. సీనియర్ హీరోల్లో మెగాస్టార్ టాప్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం ఓ క్రేజీ ప్రాజెక్టు చేస్తున్నారు. బింబిసార దర్శకుడు వశిష్టతో ఒక సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నారట మేకర్స్. ఇటీవల పూజా కార్యక్రమాలంతో మొదలైన ఈ సినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా 156 గా వస్తున్న ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ఫిక్స్ చేయనారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 40 ఏళ్ళు గడుస్తున్నా ఆయన స్టామినా, క్రేజ్ మాత్రం కొంచం కూడా తగ్గలేదు. రే ఎంట్రీలో మునుపటికన్నా స్పీడ్ గా ప్రాజెక్ట్స్ ఫినిష్ చేస్తున్నారు మెగాస్టార్. అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలో కూడా ఇప్పటికీ టాప్ లో ఉన్నారు చిరంజీవి. తాజాగా ఆయన రెమ్యునరేషన్ గురించి కొన్ని వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. వశిష్ట సినిమా తరువాత చిరంజీవి ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే మొదలుకానుంది. 

ఈ సినిమా కోసం రికార్డ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట మెగాస్టార్. ఆయనకు రూ.50 కోట్ల పారితోషకం ఇవ్వడానికి ఫిక్స్ అయ్యాడట దిల్ రాజు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కారణం సీనియర్ హీరోలు ఏ హీరో కూడా రూ.50 కోట్ల దగ్గరలో కూడా  రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. అందులో బాలకృష్ణ రూ.25 కోట్లు, నాగార్జున, వెంకటేష్ రూ.10 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారు. కనీసం చిరు దగ్గరలో కూడా లేరు ఈ హీరోలు. అలా సీనియర్ హీరోల్లో రికార్డ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు మెగాస్టార్.