కొత్త కథతోనే వస్తున్న చిరంజీవి.. రీమేక్ కాదట

కొత్త కథతోనే వస్తున్న చిరంజీవి.. రీమేక్ కాదట

మెగాస్టార్ చిరంజీవి మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. చిరంజీవి నటించే కొత్త మూవీని ప్రకటించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) బంగార్రాజు ఫేమ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల(Kalyan Krishna Kurasala) కాంబినేషన్ లో ఓ కామెడీ ఎంటర్టైనర్ రాబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మెగా డాటర్ సుష్మిత ఓన్ ప్రొడక్షన్ హాస్ అయిన  హౌస్ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. నేను లోకల్, ధమాకా వంటి సూపర్ హిట్ చిత్రాలతో సక్సెస్ ఫుల్ రైటర్ గా పేరు పొందిన బెజవాడ ప్రసన్న కుమార్ (Bejavada Prasanna Kumar) ఈ  కథని సిద్ధం చేసినట్లు తెలిసింది. తండ్రి కొడుకుల నేపథ్యంతో రాబోతున్న ఈ చిత్రంలో చిరు కొడుకుగా సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్నట్లు సమాచారం.

 17 ఏళ్ళ తరువాత త్రిష,చిరు జోడీ... 

ఈ చిత్రంతో 17 ఏళ్ళ తరువాత త్రిష(Trisha),చిరంజీవి(Chiranjeevi)మళ్ళీ జోడీగా నటిస్తున్నారు. టాలీవుడ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీ లీల(Sree lila)
సిద్దు జొన్నల గడ్డ(Siddu Jonnala Gadda) తో జోడి కట్టనున్నట్టు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉంది.