తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలసిన చిరంజీవి

తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలసిన చిరంజీవి

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను మెగాస్టార్ చిరంజీవి బుధవారం కలిశారు. మర్యాదపూర్వకంగా కలసిన ఆయన పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి సత్కరించారు. సీఎంగా అధికారం చేపట్టిన స్టాలిన్ రాజకీయ పార్టీలకు అతీతంగా పరిపాలిస్తూ రాజకీయ పార్టీలే కాదు అన్ని వర్గాల ప్రజల అభిమానం చూరగొన్నారు. ప్రజా సేవకు పెద్దపీట వేస్తూ తక్కువ వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా మార్గదర్శకంగా నిలిచే రీతిలో ముందుకు సాగుతూ హాట్ టాపిక్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నై వెళ్లిన చిరంజీవి బుధవారం సీఎం ఎంకే స్టాలిన్ ను కలిసి అభినందనలు తెలియజేశారు. చిరంజీవి సీఎం స్టాలిన్ వద్దకు వచ్చిన సమయంలో స్టాలిన్ తనయుడు ఉదయనిధి కూడా అక్కడే ఉన్నారు.