చిరంజీవి, మురుగదాస్, అనిరుధ్.. ఇది కదా కాంబో అంటే!

చిరంజీవి, మురుగదాస్, అనిరుధ్.. ఇది కదా కాంబో అంటే!

మెగాస్టర్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన భోళా శంకర్(Bhola shankar) పరాజయం పాలైన నేపధ్యంలో.. ఆయన తరువాతి సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలోనే చాల మంది డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. అందులో సోగ్గాడే చిన్నినాయన(Soggade chinninayana) ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల(Kalyan krishna kurasala), బింబిసార(Bimbisara)  ఫేమ్ వశిష్ట(Vashishta) పేర్లు బలంగా వినిపించాయి. 

ఈ ఇద్దరిలో ఎవరొఒకరితో మెగాస్టార్ తరువాతి సినిమా ఉంటుంది అని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ లిస్టులోకి ఇప్పుడు తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్(AR Murugadoss) పేరు చేరింది. తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవితో మురుగదాస్ ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని టాక్ నడుస్తోంది. ఇక్కడ మరి విశేషం ఏంటంటే.. ఈ సినిమాను లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh) సంగీతం అందిస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ మెగా అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.  

నిజానికి చిరంజీవికి ఇలాంటి కాంబోలో పడాలని చాలా కాలంగా ఆయన ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. ఎంతసేపు ఆ రొట్ట కమర్షియల్ సినిమాలే కాకుండా.. వయసుకు తగ్గ బలమైన పాత్రలు చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి కాంబోనే ఇదని.. చిరంజీవి, మురుగదాస్, అనిరుద్ ఈ కాంబో ఖచ్చితంగా సెట్ అవ్వాలని కోరుకుంటున్నారు. మురుగదాస్ కూడా రొటీన్ కమర్షియల్ సినిమాలకు చాలా దూరంగా ఉంటారు. ఆయన సినిమాల్లో ఎదో ఒక బలమైన కంటెంట్ ఉంటుంది. అలాంటి దర్శకుడితో చిరంజీవికి సినిమా పడితే అది నెక్స్ట్ లెవల్లో ఉంటుందని, ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలవడం ఖాయం అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. మరి కాబో సెట్ అవుతుందా అనేది చూడాలి.