చిరు ఫ్యాన్స్ Vs బాలయ్య ఫ్యాన్స్..ఆ అభిమానితో చిరు అలా చేయడంతో మొదలైన సోషల్ మీడియా వార్

చిరు ఫ్యాన్స్ Vs బాలయ్య ఫ్యాన్స్..ఆ అభిమానితో చిరు అలా చేయడంతో మొదలైన సోషల్ మీడియా వార్

మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజులుగా లండన్, ప్యారిస్ పర్యటన ముగించుకుని ఎయిర్ పోర్ట్ లో దిగిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చిరంజీవితో సెల్ఫీ దిగాలని వచ్చిన ఓ అభిమానిని తోసేస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఈ వీడియో వైరల్ అవడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ నడుస్తోంది. వివరాల్లోకి వెళితే..

చిరు ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే అక్కడున్న కొందరు సిబ్బంది సెల్ఫీల కోసం ట్రై చేశారు. అందులో ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ వ్యక్తి చిరుతో సెల్ఫీ దిగడం కోసం ఎంతో ఆతురతగా ట్రై చేస్తూ..ఎలాగైనా చిరుతో ఒక్క ఫోటో దిగాలని అనుకున్నాడు. ఇక ఆ అభిమాని సెల్ఫీ కోసం పదే పదే ప్రయత్నించడంతో చిరు విసుగ్గా ఆ అభిమాని వెనుక చేయి వేసి పక్కకు నెట్టేశాడు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో చిరంజీవిపై నెటిజన్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వీడియోని హరీష్ మేనన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.."ముందు నడుస్తున్న ఫిమేల్ ఎయిర్‌లైన్స్ స్టాఫ్ ఫోటో అడిగిన వ్యక్తిని అడ్డు తప్పుకోమని సైగ చేసింది. లాంగ్ ఫ్లైట్ జర్నీ చేసి, కుటుంబంతో వెళ్తున్న వ్యక్తికి రెండు సార్లు అడ్డంగా నిలబడి విసిగించటం అసలు కరక్టేనా? సివిక్ సెన్స్ అనేది ఒకటి ఏడ్చి చచ్చింది కదా!! చిరంజీవిగారు మంచోడు కాబట్టి సింపుల్ డ్యాన్స్ మూమెంట్‌లా జస్ట్ అలా నెట్టి వదిలేశాడు! " అంటూ రాశాడు. దీంతో వార్ మెగా ఫ్యాన్స్ Vs బాలయ్య ఫ్యాన్స్ అనేలా మారింది. 

అయితే ఈ వ్యవహారంపై ..'అదే బాలయ్య బాబు ఇలా చేస్తే..అందరు ఏడ్చి చచ్చేవారు కదా' అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండగా..మరికొందరు 'మనవాడు చేస్తే సంసారం..ఎదుటివాడు చేస్తే వ్యభిచారం' అని..'ఫ్యాన్స్ నీ ప్రేక్షక దేవుళ్లు అని స్టేజ్ మీద తెగ పొగడతారు కదా, అలాంటి ఫ్యాన్స్ ఒక అర నిమిషం సెల్ఫీ అడిగితే సహనం ఉండాలి కదా మరి, అతనేమీ ఆయన స్పేస్ లోకి వెళ్ళలేదు, ఆయనే పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చారు.మొన్నీ మధ్యనే నాగార్జున ఫ్యాన్ ఒకరు పక్కకి నెట్టి వేస్తే ఆయన పబ్లిక్ గా సారీ చెప్పారు కామెంట్స్ చేయడం గమనార్హం. ఇక ఇంకొందరు చిరుకి మద్దతుగా..వాళ్లకూ ప్రైవసీ ఉంటుంది కదా..అతడు చేసిన దాంట్లో తప్పేమీ లేదని కామెంట్లు చేశారు. అయితే, ఏదేమైనప్పటికీ హీరోలతో సెల్ఫీ దిగాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో తెలియాల్సి ఉంది.