సుందరం మాస్టర్ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లాంచ్

సుందరం మాస్టర్ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లాంచ్

కమెడియన్‌‌‌‌ హర్ష చెముడు లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’. దివ్య శ్రీపాద హీరోయిన్. కళ్యాణ్ సంతోష్‌‌‌‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు కలిసి నిర్మించారు. ఫిబ్రవరి 23న సినిమా విడుదల కానుంది. గురువారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను చిరంజీవి రిలీజ్ చేసి టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌లో హర్ష మాట్లాడుతూ ‘మా లాంటి కొత్త వాళ్లని, చిన్న సినిమాను ఎంకరేజ్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి గారికి థాంక్స్. ఈ సినిమా చాలా కొత్త పాయింట్‌‌‌‌తో రాబోతోంది.  

సుందరం మాస్టర్ పాత్రను చూస్తే మనలో ఒకరిని చూసినట్టుగానే అనిపిస్తుంది. అందర్నీ ఆలోచింపజేసే చిత్రం అవుతుంది. కామెడీనే కాకుండా ఎమోషన్ కూడా ఉంటుంది’ అని చెప్పాడు.  మైనా పాత్ర తనకోసం రాసినందుకు దర్శకుడికి థ్యాంక్స్ చెప్పింది దివ్య శ్రీపాద. డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశా. ట్రైబల్ విలేజ్‌‌‌‌లో అందరూ ఇంగ్లీష్ అంత ఫ్లూయెన్స్‌‌‌‌గా ఎలా మాట్లాడుతారు అనే దానికి ఓ కారణం ఉంటుంది. అదేంటో సినిమా చూస్తే తెలుస్తుంది’ అన్నాడు. ప్రొడక్షన్‌‌‌‌లో రవితేజ గారి సపోర్ట్‌‌‌‌ మర్చిపోలేను అన్నాడు నిర్మాత సుధీర్.  మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, కెమెరామెన్ దీపక్ తదితరులు పాల్గొన్నారు.‌‌‌‌‌‌‌