
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇంద్ర (Indra) సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు వైజయంతి మూవీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ బర్త్ డే కానుకగా గురువారం (ఆగస్ట్ 22న) ఇంద్ర రీ రిలీజ్ కాబోతున్నట్లు చెబుతూ..మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన వీడియోని పంచుకున్నారు. చిరంజీవి కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలలో ఇంద్ర ఒకటి కావడంతో చిరు పంచుకున్న విశేషాలివే.
మళ్ళీ థియేటర్లో ఇంద్ర సినిమా చూసే ఆడియన్స్ కు ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అని, బాగా ఎంజాయ్ చేయండని చిరంజీవి ఈ వీడియో ద్వారా అన్నారు. ‘ఇంద్ర.. ఇంద్ర సేనారెడ్డి..అంటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అది పవర్ ఆఫ్ ఇంద్ర. అలాంటి పవర్ ఫుల్ సినిమా, పెద్ద సక్సెస్ సాధించిన సినిమా ఇంద్ర. అంతటి ప్రజాదరణ పొందడానికి కారణం చిత్ర కథ. సినిమా కోసం ప్రతిఒక్కరు చాలా కష్టపడ్డారు. నా చిత్రాల్లో అత్యంత సాంకేతిక విలువలున్న ఉత్తమ కమర్షియల్ చిత్రం ఇంద్ర.
ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ అందించిన పాటలు, ఆ పాటలకు నృత్య రీతులు సమకూర్చిన డ్యాన్స్ మాస్టర్స్, సింగర్స్ ఇలా ప్రతి ఒక క్రాఫ్ట్ ఎంతో గుర్తించతగ్గ పనితనం కనబరిచారు. ఇపుడు ఇంద్ర సినిమా ఉత్తమ 22 సంవత్సరాల రీ-రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది. చాలా భావోద్వేగానికి గురవుతూన్నా. డైరెక్టర్ బి. గోపాల్ ఈ సినిమా కథని బాగా చెక్కి,తెరకెక్కించి విజయానికి కారకుడయ్యాడు.
ఇంద్ర సినిమా విశేషాలు:
మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర ముందువరకు ఫ్యాక్షన్ సినిమాలు బాస్‌కి సెట్ కావు..జస్ట్ మాస్ కామెడీ సినిమాలకే మాత్రమే సెట్ అవుతాయి అనే ఓ వర్గం నోళ్లని ఒక్క సినిమాతో మూయించాడు మెగాస్టార్. డైరెక్టర్ బి.గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమాను ప్రముఖ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించగా చిన్ని కృష్ణ కథను రాశాడు. 2002 జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అల్టిమేట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు ఆ రోజుల్లోనే రూ.55 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే ఈ సినిమా రీసెంట్‌గా 22 ఏండ్లు పూర్తి చేసుకుంది.అంతేకాకుండా..అప్పట్లోనే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు రూ.1కోటి ఇవ్వడం విశేషం.