Chiranjeevi: నేషనల్ క్రష్.. నా క్రష్ కూడా.. రష్మికపై చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Chiranjeevi: నేషనల్ క్రష్.. నా క్రష్ కూడా.. రష్మికపై చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘కుబేర’ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ సోషల్ డ్రామాను అన్నీ వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ సక్సెస్ మీట్ను ఆదివారం (జూన్22న) మేకర్స్ నిర్వహించారు.

కుబేర సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సూపర్ హిట్ కుబేర సక్సెస్ మీట్‌లో భాగంగా ప్రతిఒక్క విభాగ పనితీరును చిరు మెచ్చుకున్నారు. ఇందులో నటించిన నటీనటుల టాలెంట్ను ప్రత్యేకించి మాట్లాడారు. 

ఈ క్రమంలో హీరోయిన్ రష్మిక మందన్న గురించి చిరు సరదాగా మాట్లాడుతూ.. ‘నేషనల్ క్రష్.. నా క్రష్ కూడా.. కానీ, నేను ఆ మాట అనను. కానీ, లోపల అనుకుంటాను అంతే. పైకి మాత్రం అనను. 2018లో వచ్చిన రష్మిక ఫస్ట్ మూవీ "ఛలో" సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి కూడా నేనే గెస్ట్ గా వచ్చాను.

ఆరోజు నుంచి నేటివరకు తన నటనతో ఎంతో సాధించింది. ఒక హీరోయిన్ గా తన నేషనల్ మాత్రమే కాదు.. ఇంటర్నేషనల్ కూడా.. ’ అని రష్మిక నటనను మెచ్చుకున్నారు చిరంజీవి. ఈ క్రమంలో స్టేజీపై ఉన్న రష్మిక.. తనపై కురిపిస్తున్న చిరు ప్రశంసలకు కృతజ్ఞత చెబుతూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చిరు స్పీచ్ వైరల్ అవుతుంది.

అలాగే, హీరో నాగార్జున గురించి మాట్లాడుతూ.. ' కుబేర తర్వాత నాగార్జున మరో 40 ఏళ్లు అద్భుతంగా రాణిస్తారనేది వాస్తవం. ఈ క్యారెక్టర్ శేఖర్ రాయడం, అది నాగార్జున గారు ఒప్పుకొని చేయడం.. సినిమాకు ఇదే ఫస్ట్ సక్సెస్‌గా భావిస్తున్నాను. నాగ్ కి మరిన్ని డిఫెరెంట్ రోల్స్ వస్తాయి. ఇక ఫ్యూచర్ లో నేను కూడా ఆయన బాటలోనే వెళ్లే ఛాన్స్ కనిపిస్తుందని' మెగాస్టార్ చిరంజీవి అన్నారు.