మొగిలయ్యకు చిరు సాయం.. ఇది కదా బలగం అంటున్న ఫ్యాన్స్

మొగిలయ్యకు చిరు సాయం.. ఇది కదా బలగం అంటున్న ఫ్యాన్స్

బలగం సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయిన పాట.. ‘తోడుగా మా తోడుండి.. నీడలా మాతో నడిచి’. ఈ జానపద పాట బలగం సినిమాకు బలం అయింది. అందరి ప్రశంసలు అందుకుంది. అందరి మనసును హత్తుకునేలా ఈ పాట పాడిన మొగులయ్య, కొమురమ్మ దంపతుల్ని అందరూ మెచ్చుకున్నారు.

దాంతో బలగం మొగులయ్య దంపతులుగా వీళ్లకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, గత కొంత కాలంగా మొగులయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నాడని వార్తలు వస్తున్నాయి. దాంతో పలువురు సెలబ్రెటీలు వాళ్లకు తోచిన సాయం అందిస్తున్నారు.

తాజాగా మెగా స్టార్ చిరంజీవి.. మొగులయ్యకు చికిత్స అందించడానికి ముందుకొచ్చాడు. తన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన చిరు.. మొగులయ్యకు కంటి ఆప్రిషన్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని బలగం డైరెక్టర్ వేణుకు ఫోన్ చేసి చెప్పగా.. వేణు మొగులయ్య దంపతులకు ఈ కబురు అందించాడు.

ఈ విషయాన్ని ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మొగులయ్య దంపతులు పంచుకున్నారు. తమపై ప్రేమ చూపించి.. చికిత్స అందిస్తున్న చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యా్న్స్ ‘ఇది కదా.. అసలైన బలగం’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.