ఇవాళ సైరా ట్రైలర్.. ప్రి-రిలీజ్ ఈవెంట్ వాయిదా

ఇవాళ సైరా ట్రైలర్.. ప్రి-రిలీజ్ ఈవెంట్ వాయిదా

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబర్‌‌‌‌ 2న విడుదల కానుంది. ఈ రోజు ప్రీ రిలీజ్ కూడా జరగాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఈ ఈవెంట్ వాయిదా పడింది. అటెండ్ కావలసిన ఒక ముఖ్య అతిథికి రావడం వీలు పడకపోవడంతో కావాలనే  పోస్ట్‌‌పోన్ చేశారని కొందరు అంటున్నారు.

అయితే సైరా టీమ్ మాత్రం వాతావరణం ప్రతికూలంగా ఉండటం వల్ల ఇంత పెద్ద వేడుకకు ఎలాంటి విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దూర ప్రాంతాల నుంచి రావడానికి రెడీ అయిపోయిన మెగా ఫ్యాన్స్‌‌కి ఇది కాస్త నిరాశ కలిగించే అంశమే. అయితే వారు డిజప్పాయింట్ కాకుండా  ట్రైలర్‌‌‌‌ను ఈ రోజే విడుదల చేయనున్నారు. ఇంకేముంది… మెగా ఫ్యాన్స్ హ్యాపీ!