Megastar Chiranjeevi: ఎవరూ ఊహించని గెటప్లో చిరంజీవి.. కెరీర్లో ఫస్ట్ టైమ్ అలా!

Megastar Chiranjeevi: ఎవరూ ఊహించని గెటప్లో చిరంజీవి.. కెరీర్లో ఫస్ట్ టైమ్ అలా!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ విశ్వంభర(Vishwambhara). బింబిసార ఫేమ్ వశిష్ట(Vassishta) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దాదాపు రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు మేకర్స్. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో భారీ గ్రాఫిక్స్ అండ్ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజు రోజు కు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన టైటిల్ వీడియోతో ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. అందుకే ఈ క్రేజీ ప్రాజెక్టు కు సంబంధించి చిన్న న్యూస్ వినిపించిన అది క్షణాల్లో వైరల్ అవుతోంది. 

తాజాగా అలాంటి న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్ లో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమా కోసం మెగాస్టార్ ఇప్పటివరకు కనిపించని సరికొత్త అవతారంలో కనిపించనున్నారట. అవును.. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కీలకం కానున్నాయట. ఆ సీన్స్ ఆడియన్స్ కు గూస్బంప్స్ తెప్పిస్తాయని టాక్ నదిస్తోందిట. దాదాపు 20 నిమిషాల పాటు ఉండే ఆ సీక్వెన్స్ సినిమాకు హైలెట్ గా నిలువనుందట. ఆ సీన్ లో చిరంజీవి 70 ఏళ్ళ పైబడ్డ వ్యక్తిగా కనిపించనున్నారట. కథ డిమాండ్ ప్రకారమే చిరు ఈ పాత్ర చేయడానికి ఒకే అన్నారట. గెటప్ విషయంలో ప్రయోగాలు చేయడానికి చాల దూరంగా ఉంటారు మెగాస్టార్ అలాంటిది మొదటి సారి చిరు అలాంటి పాత్ర చేస్తున్నారని తెలియడంతో ఆడియన్స్ లో ఆసక్తిపెరిగింది.

ఇక విశ్వంభర సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తున్న విషయం తెల్సిందే. అంతేకాదు ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, సురభి, ఇషా చావ్లా వంటి హీరోయిన్స్ కూడా నటించనున్నారని సమాచారం. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా 2025 సంక్రాంతికి థియేటర్స్ లోకి రానుండగా.. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. మరి భారీ అంచనాలు మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.