సంక్రాంతికి విశ్వంభర.. సెట్స్లో అడుగుపెట్టిన చిరంజీవి

సంక్రాంతికి విశ్వంభర.. సెట్స్లో అడుగుపెట్టిన చిరంజీవి

పద్మ విభూషణ్‌‌‌‌(Padma Vibhushan) అవార్డుతో చిరంజీవి(Chiranjeevi) ఖ్యాతి మరింత పెరిగింది. మరోవైపు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు.  ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న విశ్వంభర(Vishwambhara) చిత్రం భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. బింబిసార(Bimbisara) ఫేమ్ వశిష్ట(Vassishta) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌‌‌‌లో  వేసిన స్పెషల్‌‌‌‌ సెట్‌‌‌‌లో  కీలక సన్నివేశాలు తీస్తున్నారు. శుక్రవారం నుంచి మెగాస్టార్‌‌‌‌‌‌‌‌ షూటింగ్‌‌‌‌లో జాయిన్ అయినట్టు అప్‌‌‌‌డేట్ ఇచ్చిన మేకర్స్.. ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ను కూడా అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌ కు గుడ్ న్యూస్ చెప్పారు.

వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు  ప్రకటించారు. ఈ సందర్భంగా  చిరంజీవి ‘విశ్వంభర’ వరల్డ్‌‌‌‌లోకి  అడుగుపెడుతున్నట్లుగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం 13 మ్యాసీవ్ సెట్‌‌‌‌లను నిర్మించి న్యూ వరల్డ్‌‌‌‌ని క్రియేట్ చేసినట్టు మేకర్స్ చెప్పారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌‌‌‌ టీజర్‌‌‌‌‌‌‌‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి.  ఫాంటసీ అడ్వెంచర్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మిస్తున్నారు.  కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌‌‌‌‌‌‌‌గా, సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు.