విడుదలకు ముందే విశ్వంభర రికార్డ్స్.. చిరు కెరీర్ లోనే ఫస్ట్ టైమ్

విడుదలకు ముందే విశ్వంభర రికార్డ్స్.. చిరు కెరీర్ లోనే ఫస్ట్ టైమ్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర(Vishwambhara). బింబిసార దర్శకుడు వశిష్ట(Vassishta) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల విడుదలైన విశ్వంభర టైటిల్ వీడియో సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐనా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా అలాంటి న్యూస్ ఒకటి ఈ సినిమా గురించి నెట్టింట వైరల్ అవుతోంది. 

అదేంటంటే.. విశ్వంభర సినిమా ఓవర్సేస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయట. యూవీ క్రియేషన్స్ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న ఈ సినిమా హక్కులను ఏకంగా రూ.18 కోట్లకు అమ్మేశారట మేకర్స్. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇది చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ అమౌంట్ అవడం. ఇక సినిమా మొదలుకాకుండానే ఈ రేంజ్ బిజినెస్ జరగడం అంటే మాములు విషయం కాదు. కాబట్టి.. సినిమాలో కచ్చితంగా విషయం ఉంది ఉంటుంది అని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్. మరి విడుదలకు ముందే ఈ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. విడుదల తరువాత ఎలంటూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 

ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు మేకర్స్. అంతేకాదు.. ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నామని, ఆ క్రమంలో వచ్చే విజువల్స్ ఆడియాన్స్ ను మెస్మరైజ్ చేస్తాయని, ఖచ్చితంగా ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో టాప్ 3లో ఉంటుందని దర్శకుడు వశిష్ట ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. మరి ఈ సినిమా ఆడియన్స్ కు ఎలాంటి అనుభూతిని మిగిల్చనుందో చూడాలంటే 2025 సంక్రాంతి వరకు ఆగాల్సిందే.