
చిరంజీవి హీరోగా నటిస్తున్న 156వ సినిమాకు టైటిల్ను ఫిక్స్ చేశారు. ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న టైటిల్నే ఫైనల్ చేశారు. సంక్రాంతి రోజున ‘విశ్వంభర’ టైటిల్ను ప్రకటిస్తూ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషియో ఫాంటసీ బ్యాక్డ్రాప్లో దీన్ని రూపొందిస్తున్నట్టు టైటిల్ గ్లింప్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. రగ్బీ ఆకారంలో ఉన్న మ్యాజికల్ బాక్స్.. విశ్వంలో ప్రయాణం చేస్తూ, గ్రహశకలాలను ఢీకొంటూ వచ్చి భూమికి చేరుకుంటుంది.
అది పడ్డ చోట భారీ విస్ఫోటనం జరగగా, అందులో నుంచి ‘విశ్వంభర’ టైటిల్ను రివీల్ చేశారు. మధ్యలో భారీ హనుమంతుడి విగ్రహాన్ని చూపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచారు. రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య జరిగే కథ ఇదని తెలుస్తోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి నెక్స్ట్ షెడ్యూల్ మొదలవనుంది. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.