‘లాల్ సింగ్ చడ్డా’ నుండి నాగచైతన్య ఫస్ట్ లుక్

‘లాల్ సింగ్ చడ్డా’ నుండి నాగచైతన్య ఫస్ట్ లుక్

"‘లాల్ సింగ్ చడ్డా’, చెడ్డీ బడ్డీ ‘బాలరాజు’ ని మీకు పరిచయం చేస్తున్నాను. అలనాటి ‘బాలరాజు’ మనవడు మన అక్కినేని నాగ చైతన్యే ఈ బాలరాజు" అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'లాల్ సింగ్ చడ్డా'. ఈ మూవీకి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో యంగ్ హీరో నాగచైతన్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

తాజాగా ఈ చిత్రం నుంచి నాగచైతన్య ఫస్ట్ లుక్ ను చిరంజీవి విడుదల చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఫోటో షేర్ చేశారు. ఇక ఈ చిత్రం ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులోనూ ఇదే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమాలో కరీనా కపూర్ రూప పాత్రలో నటించింది.. ఇటీవల ఈ చిత్రం నుంచి కరీనా ఫస్ట్ లుక్ ను చిరు విడుదల చేసిన విషయం తెలిసిందే.