‘నువ్వు శ్రీదేవి.. నేను చిరంజీవి’ పాటలో చిరు స్టైలిష్ స్టెప్స్

‘నువ్వు శ్రీదేవి.. నేను చిరంజీవి’ పాటలో చిరు స్టైలిష్ స్టెప్స్

మాస్ మూమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెగాస్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదిగిన చిరంజీవి సిగ్నేచర్ స్టెప్స్‌ తో ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఉత్సాహపరుస్తారు. ఆయన సినిమా వస్తోందంటే అన్నింటికంటే డ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అందుకే కొరియోగ్రఫీ విషయంలో చిరు స్పెషల్ కేర్ తీసుకుంటారు. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’లోనూ తనదైన డ్యాన్స్ మూవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెస్మరైజ్ చేస్తున్నారు. సోమవారం రిలీజ్ చేసిన ‘నువ్వు శ్రీదేవి.. నేను చిరంజీవి’ పాటలో శ్రుతిహాసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి స్టైలిష్ స్టెప్స్ వేశారు. ‘నువ్వు సీతవైతే.. నేను రాముడినంటా. నువ్వు రాధవైతే.. నేను కృష్ణుడినంటా. నువ్వు లైలావైతే.. నేను మజ్నునంటా. నువ్వు జులియట్ వైతే.. నేనే రొమియోనంటా.. నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవినంటా’ అంటూ సాగిన పాటలో చిరంజీవి బ్లేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్టైలిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. 

శ్రుతిహాసన్ కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ శారీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకుంది. ‘రాయే రాయే చేసేద్దాం తప్పు.. రాకింగ్ కాంబో అంట నా గ్రేసు.. నీ నవ్వు’ అంటూ చిరు మాస్ ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి తగ్గట్టుగా దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేయడంతోపాటు లిరిక్స్ కూడా రాశాడు. జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ జాజ్ , సమీరా భరద్వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనర్జిటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మంచు కొండల మధ్య పిక్చరైజ్ చేసిన విజువల్స్ బాగున్నాయి. బాబీ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మైత్రిమూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలవుతోంది.