డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్

డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్

తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎన్నికయ్యారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌‌‌‌కు ఆయన కొరియోగ్రఫీ అందించారు. కన్నడలో సుదీప్ ‘రా రా రక్కమ్మ’, హిందీలో సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో మూడు పాటలకు కొరియోగ్రఫీ చేసి.. పాన్ ఇండియా లెవల్‌‌‌‌లోనూ క్రేజ్ సొంతం చేసుకున్నారు. గురువారం జరిగిన జానీ మాస్టర్ ప్రమాణ స్వీకారానికి తమిళ, కన్నడ, మలయాళ భాషల నుంచి డ్యాన్స్ డైరెక్టర్లు వచ్చారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు,  ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కె.ఎల్. దామోదర ప్రసాద్ సహా తదితరులు పాల్గొన్నారు.