సీఐడీ నటుడు దినేష్ ఫడ్నిష్ ఇకలేరు

సీఐడీ నటుడు దినేష్ ఫడ్నిష్ ఇకలేరు

ప్రముఖ హిందీ సీరియల్ నటుడు దినేష్ ఫడ్నిష్‌‌ మరణించారు. దక్షిణాది భాషల్లోనూ సూపర్ హిట్ అయిన ‘సిఐడి’ సీరియల్‌‌ ద్వారా ఆయన ఇక్కడి ప్రేక్షకులకు కూడా సుపరిచితం. కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌‌తో సోమవారం అర్థరాత్రి దాటాక కన్నుమూసినట్టు నటుడు దయానంద్ శెట్టి కన్‌‌ఫర్మ్ చేశారు.

‘సీఐడీ’ సీరియల్‌‌లోని  సీనియర్‌‌‌‌ ఇన్‌‌స్పెక్టర్ పాత్రతో పాపులర్ అయ్యారు దినేష్.  ఇండియన్ టెలివిజన్ చరిత్రలోనే ఎక్కువ కాలం ప్రసారమైన టీవీ షోలలో ‘సీఐడీ’ ఒకటి. ఫ్రెడ్రిక్స్ పాత్రలో తనదైన కామెడీ టైమింగ్‌‌తో నవ్వించడంతో పాటు కొన్ని ఎపిసోడ్స్‌‌కు రచయితగానూ వ్యవహరించారు దినేష్. అలాగే సర్పరోష్, సూపర్ 30 లాంటి బాలీవుడ్ సినిమాల్లోనూ ఆయన నటించారు.