క్యాన్సర్ ఒకసారి వచ్చి నయమయ్యాక ఇక మనకు తిరుగులేదు అనుకుంటే అది పొరపాటే! ముఖ్యంగా పొగాకు అలవాటు ఉన్నవారిలో చికిత్స తర్వాత కూడా క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. మన దేశంలో అవగాహన లేకపోవడం వల్ల 80 శాతం మంది చివరి దశలోనే ఆసుపత్రికి వస్తున్నారు. ఇంతటి భయంకరమైన పరిస్థితి ఒకవైపైనా... మరోవైపు సిగరెట్ పొగ కేవలం మనుషుల ప్రాణాలను మాత్రమే కాదు, మనం బతుకుతున్న భూమిని, పర్యావరణాన్ని కూడా నిలువునా కాల్చేస్తోంది. కోట్ల చెట్ల నరికివేత, బిలియన్ల కొద్దీ నీటి వృధాతో పొగాకు సృష్టిస్తున్న ఆ పర్యావరణ విధ్వంసం, మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టే ప్రమాదాల వెనుక ఉన్న దిగ్భ్రాంతికరమైన నిజాలు ఇప్పుడు చూద్దాం...
క్యాన్సర్ వస్తే నోరు, గొంతు, బుగ్గల ప్రాంతమంతా ఎగుడు దిగుడు ఉంటుంది. అందువల్ల చికిత్స చేసినప్పటికీ ఏదో ఒక మూల క్యాన్సర్ కారకాలు దాక్కుంటాయి. రెండు మూడేళ్లలో మళ్లీ తిరగబెడతాయి. పైగా వేరే దేశాల్లో 40 శాతం క్యాన్సర్ సోకితే అడ్వాన్స్ డ్ స్టేజీ.. కానీ, మన దగ్గర 80 శాతం మంది.. మూడో స్టేజీలో ట్రీట్మెంట్ కి వస్తారు. ఈ స్టేజ్లో లో సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్... అన్నీ కలిపి. ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ క్యాన్సర్ నయమయ్యాక పోగకి దూరంగా ఉంటారా ! అంటే అదీ లేదు.
'వచ్చింది ఏదో వచ్చింది ట్రీట్మెంట్ చేయించుకున్నాం కదా అని మళ్లీ స్మోకింగ్ మొదలుపెడతారు. కానీ, ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినా సరే ఎఫెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తుంది. కానీ, కారణానికి కాదు. రేడియేషన్, సర్జరీ, కీమోథెరపీ ఏది తీసుకున్నా ఆ ఏరియాల్లోకి మళ్లీ పొగ వెళ్తే క్యాన్సర్ తిరగబడుతుంది.
ALSO READ : నిమిషం ఆనందం.. నిండు జీవితం సర్వనాశనం
భూమిని కూడా
పెట్రోల్, డీజిల్ పొగలకి తోడు సిగరెట్ పొగ తోడైతే స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరుకుతుంది ? పైగా పొగాకు ఉత్పత్తుల తయారీ కోసం సంవత్సరానికి 600 మిలియన్ల చెట్లని కొట్టేస్తున్నారు. రెండు లక్షల హెక్టార్ల భూమిని కెమికల్స్ తో నింపేస్తున్నారు. 22 బిలియన్ టన్నుల నీళ్లు ఖర్చు అవుతున్నాయి. 81 మిలియన్ టన్నులు కార్బన్ డై ఆక్వైర్ని వదులుతున్నారు. వీటిన్నింటి వల్ల భూమి కూడా విషంగా మారుతోంది. అందుకే ఈ సంవత్సరం "పొగాకు: పర్యావరణానికి ముప్పు" అనే థీమ్ తో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతోంది డబ్ల్యూహెచ్.
