- చారిత్రక మైలురాయిగా పేర్కొన్న ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా
లేహ్: లడఖ్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. జమ్మూకశ్మీర్, లడఖ్ హైకోర్టు లడఖ్బెంచ్ను లేహ్‌లో ఆదివారం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. తమ ప్రాంతంలోనే హైకోర్టు ధర్మాసనం అందుబాటులోకి రావడం చరిత్రాత్మక పరిణామమని, న్యాయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ఇదొక మైలురాయి అని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ కుమార్ సక్సేనా పేర్కొన్నారు.
ప్రారంభోత్సవం అనంతరం ఎల్జీ సక్సేనా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. 'లడఖ్‌లో సులభతర న్యాయ సేవల కొత్త శకం ప్రారంభమైంది. లేహ్ వేదికగా లడఖ్ హైకోర్టు బెంచ్‌ను ప్రారంభించిన సీజేఐకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు' అని తెలిపారు. గత 6 నెలల్లో సీజేఐ లడఖ్‌లో రెండోసారి పర్యటించడం, మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా న్యాయాన్ని అందించాలనే ఆయన నిబద్ధతను తెలియజేస్తోందని ఎల్జీ పేర్కొన్నారు. లడఖ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు.
