సీఎం కప్ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్ ఆదిలాబాద్

సీఎం కప్ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్ ఆదిలాబాద్

హైదరాబాద్, వెలుగు: సీఎం కప్ రెండో ఎడిషన్ స్టేట్ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. రంగారెడ్డి జిల్లా రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకోగా.. కరీంనగర్ థర్డ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకుంది. మంగళవారం ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ముంగిపు వేడుకల్లో లెజెండరీ షట్లర్ సైనా నెహ్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ట్రోఫీలు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను సానబెట్టేందుకు ఆరంభించిన సీఎం కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీ  ప్రతీ ఏటా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ సలహాదారు జితేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి పాల్గొన్నారు.