డిసెంబర్ లో వారం పాటు శాసనసభ సమావేశాలు: కేసీఆర్

డిసెంబర్ లో వారం పాటు శాసనసభ సమావేశాలు: కేసీఆర్

అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసరపు ఆంక్షలు విధిస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. దీనివల్ల 2022 -23 ఆర్థిక సంవత్సరానికిగానూ రాష్ట్రానికి సమకూరాల్సిన ఆదాయంలో రూ.40 వేల కోట్ల రూపాయలకు పైగా తగ్గుదల చోటుచేసుకుందని చెప్పారు. ఇటువంటి చర్యల ద్వారా తెలంగాణ అభివృద్ధి ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తోందన్నారు. 

ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావును, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారు.