ఇవాళ మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ

ఇవాళ మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ

సీఎం కేసీఆర్ ఇవాళ మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని  తాజా పరిణామాలు, రాజకీయ, పాలనపరమైన అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ రిలీజైన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా పలువురు విపక్ష పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ ఇప్పటికే సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఎవరికీ మద్ధతు ఇవ్వాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గత ఎన్నికల్లో ఎన్టీయేకు మద్ధతునిచ్చిన టీఆర్ఎస్  ఈ ఎన్నికల్లో ఎవరికీ సపోర్ట్ చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.