కోవిడ్ మెడిసిన్స్ , ఆక్సిజన్ పై ట్యాక్స్ మినహాయించండి

కోవిడ్ మెడిసిన్స్ , ఆక్సిజన్ పై ట్యాక్స్  మినహాయించండి

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెరర్జీ. కరోనా రూపంలో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు మమత. ఇలాంటి సమయంలో అనేక దేశాలు సాయంచేసేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ఇందులో భాగంగా చాలా మంది ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు, కోవిడ్ రిలేటెడ్ డ్రగ్స్ ను జీఎస్టీ, ఐజీఎస్టీ నుంచి మినహాయించాలని కోరారు. కస్టమ్స్ డ్యూటీ లాంటి పన్నులను కూడా మినహాయించాలని కోరారు. చాలా మంది సాయం చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు మమత.