అక్కినేని అఖిల్ రిసెప్షన్‎కు హాజరైన సీఎం రేవంత్

అక్కినేని అఖిల్ రిసెప్షన్‎కు హాజరైన సీఎం రేవంత్

అక్కినేని అఖిల్, జైనాబ్ వివాహ రిసెప్షన్ వేడుక అట్టహాసంగా జరిగింది. అఖిల్ వివాహం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో సింపుల్‎గా జరగడంతో.. రిసెప్షన్ వేడుకను భారీగా ప్లాన్ చేశారు. ఆదివారం (జూన్ 8) కృష్ణానగర్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అఖిల్ రిసెప్షన్‎కు అటెండ్ అయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధువరులను సీఎం రేవంత్ ఆశీర్వదించారు. రిసెప్షన్ వేడుకకు హాజరైన రేవంత్ రెడ్డికి అక్కినేని నాగార్జున ఎదురెళ్లి స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ నాయకులు రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి తదితరులు ఉన్నారు. అఖిల్ వివాహానికి రావాలని నాగార్జున స్వయంగా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన విషయం తెలిసిందే. 

ఇక.. టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన బ్యాచిలర్ లైఫ్‌‌‌‌‌‌‌‌కు గుడ్ బై చెప్పి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం (జూన్ 6) తెల్లవారుజామున తన ప్రియరాలు జైనబ్‌‌‌‌‌‌‌‌ రవ్‌‌‌‌‌‌‌‌డ్జీతో అఖిల్ ఏడడుగులు వేశాడు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహ వేడుకకు చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు, శర్వానంద్, రాజమౌళి కొడుకు కార్తికేయ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో సుమంత్  సహా పలువురు సినీ సెలబ్రిటీస్ హజరై సందడి చేశారు. జూన్ 8న జరిగిన రిసెప్షన్ వేడుకకు కూడా పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరయ్యారు. తమిళ నటుడు సూర్య, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కన్నడ హీరో యశ్, రాంచరణ్, మహేష్ బాబు, తదితరులు హాజరై సందడి చేశారు.