మహబూబ్‎నగర్ బిడ్డగా కాంతారావు అవార్డ్ తీసుకున్న మొదటి వ్యక్తిని నేనే: విజయ్ దేవరకొండ

మహబూబ్‎నగర్ బిడ్డగా కాంతారావు అవార్డ్ తీసుకున్న మొదటి వ్యక్తిని నేనే: విజయ్ దేవరకొండ

హైదరాబాద్: సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక దగ్గరకు తీసుకొచ్చి గద్దరన్న పేరు మీద అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. శనివారం (జూన్ 14) హైదరాబాద్‎లోని హైటెక్స్ వేదికగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విజయ్ దేవరకొండ కత్తి కాంతారావు లైఫ్ టైమ్ అచీవ్‎మెంట్ అవార్డు అందుకున్నారు. 

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. గద్దరన్న పేరు మీద సినీ అవార్డులు ఇవ్వడం హ్యాపీగా ఉందన్నారు. నట ప్రపూర్ణ కత్తి కాంతారావు పేరు మీదుగా ప్రభుత్వం అవార్డు ఇవ్వడం ఆయనకు గొప్ప నివాళి అని అన్నారు. మహబూబ్ నగర్ బిడ్డగా కాంతారావు అవార్డు తీసుకుంటున్న మొదటి వ్యక్తిని నేనే అని.. ఇందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డ్ నుంచి ప్రేరణ పొంది భవిష్యత్‎లో ఇంకా చాలా చేయాలనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ అవార్డులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దిల్ రాజ్‎కు ధన్యవాదాలు తెలిపారు.